Thursday, April 7, 2011

కొత్త నాయకుడు

నిజానికి ఆయన కొత్తగాను రాలేదు,
ఆయన నాయకత్వ పటిమ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని అంతకన్నా లేదు.

కాని సచిన్ లు ,షారుఖ్ లు హీరో లుగా ,
... . . . . . . . . .....(పేర్లు చెప్పలేక కాదు రాయడానికి ఖాళీ సరిపోక (అంత మంది ఉన్నారు మరి) ) లీడర్ లుగా చెలామణి అవుతున్నఈ రోజుల్లో
ఓ ౭౨ ఏళ్ళ కొత్త నాయకుడు ఉదయించిన వైనం కొత్త ఆశలు చిగురింపచేసింది.

ఇప్పుడు దేశాన్నే రాలేగాంవ్ సిద్ది చేయబూనిన కిసాన్ బాబురావు హజారే (అన్నా హజారే ) సంకల్పాన్ని
మింగేయడానికి ప్రభుత్వం చేయబోతున్న కుట్రల్ని దాటి ఈ నవ భారతం ఆయనను అనుసరిస్తుందా లేక ఐ పీ ఎల్ లోనో మరి దేన్లోనో పడి కొట్టుకుపోతుందా?

ప్రజల ఫై నాయకుని నమ్మకం నిజం అవుతుందా ?
లేక
తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకుని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలచే ఈ జాతే, ప్రశ్నించడమే మానుకుంటుందా ?

No comments: